తిరుమల వెంకన్నకు రూ. కోటి విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

  • కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కరుణాకర్‌రెడ్డి
  • కోటి రూపాయల డీడీల సమర్పణ
  • విద్యాదానం ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని సూచన
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కోటి రూపాయల విరాళం సమర్పించారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న బి.కరుణాకర్ రెడ్డి తిరుమల జేఈవో శ్రీనివాసరాజును కలిసి విరాళం డీడీలను అందించారు. విరాళంగా ఇచ్చిన సొమ్మును శ్రీవేంకటేశ్వర విద్యాదానం ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని కరుణాకర్ రెడ్డి సూచించారు. శ్రీవారికి పెద్ద ఎత్తున విరాళం ఇచ్చిన ఆయనను, కుటుంబ సభ్యులను జేఈవో అభినందించారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారితోనే ఉంటాయని పేర్కొన్నారు.
Go Back to Shorts
Hyderabad
Tirumala
Tirupati
Devotee

More Telugu News